ముచ్కూర్ సొసైటీ ద్వారా యూరియా పంపిణీ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
ముచ్కూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో యూరియా పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా అప్లికేషన్ ద్వారా ముందుగా బుక్ చేసుకున్న రైతులకు వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో యూరియా సంచులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ బంగ్లా దేవేందర్ మాట్లాడుతూ, రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉన్న మేరకు సొసైటీ ద్వారా పారదర్శకంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. యూరియా అందుబాటులోకి వచ్చినప్పుడు ప్రకటనలు, ప్రచార మాధ్యమాల ద్వారా రైతులకు సమాచారం అందిస్తున్నామని పేర్కొన్నారు.
సొసైటీ, పాలకవర్గం, చైర్మన్‌ను కొందరు గిట్టని వ్యక్తులు బద్నాం చేసేందుకు తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు. యూరియా పంపిణీ పూర్తిగా నిబంధనల ప్రకారమే జరుగుతోందని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘం పనిచేస్తోందని, ఎలాంటి అపోహలు, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని చైర్మన్ బంగ్లా దేవేందర్ రైతులను కోరారు.

























