మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కిష్టాగౌడ్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ముచ్కూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొయ్యాడి చిన్న కిష్టాగౌడ్ నియమితులయ్యారు.
ఈ సందర్భంగా కిష్టాగౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగేష్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఈరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. జనరల్ సెక్రటరీగా తనపై మరింత బాధ్యత పెరిగిందని, పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని కిష్టాగౌడ్ పేర్కొన్నారు.






















