జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు!
తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల అక్రిడిటేషన్ నిబంధనలకు సంబంధించిన జీవో-252, దాని సవరణ జీవో-103లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. వాదనలు విన్న అనంతరం, జర్నలిస్టులకు ఊరట కలిగిస్తూ పాత అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటు గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది.























