Homeతెలంగాణనిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి...

నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…

నిజామాబాద్ ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం చోటుచేసుకుని ఓ వృద్ధ ప్రయాణికురాలు మృతి చెందారు.

వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ ప్రధాన బస్టాండ్‌లో నిత్యం భారీ రద్దీ ఉంటుంది. ఇలాంటి ప్రదేశంలో బస్సులను అత్యంత జాగ్రత్తగా నడపాల్సి ఉండగా, డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

భీంగల్ నుంచి నిజామాబాద్‌కు వచ్చిన డిపో-1కు చెందిన ఆర్టీసీ బస్సు బస్టాండ్‌లోకి వస్తున్న సమయంలో ఓ వృద్ధ ప్రయాణికురాలిని ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ప్రయాణికుల సమాచారంతో అంబులెన్స్‌ చేరుకుని ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బస్సు ఢీకొనడంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. తల వెనుక భాగంతో పాటు ముక్కు, చెవి నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటనపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై ఆర్టీసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదంపై పూర్తి వివరాలు సేకరించి, బాధ్యులపై విచారణ జరిపించాలని కోరుతున్నారు.
ఆర్టీసీలో చిన్న తప్పిదాలకే చర్యలు తీసుకునే అధికారులు.. ఒక ప్రయాణికురాలి ప్రాణం పోయిన ఘటనలోనూ అదే స్థాయిలో బాధ్యతగా వ్యవహరించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. డ్రైవర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారా? లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతారా? అనేది వేచి చూడాలి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వావిలాల పాఠశాలలో వనమహోత్సవం…

0
వావిలాల పాఠశాలలో వనమహోత్సవం... జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, విద్యార్థుల్లో మొక్కల సంరక్షణపై...

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి... విద్యా సంస్థలను దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులను కలిగించవద్దు... టిఎన్ఎస్ఎఫ్,టిజెఎస్,టి ఎన్విఎస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్ ఇండియా...

జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు!

0
జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు! తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల...

ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి…

0
ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి జన్మదినం సందర్భంగా ఆయన ఆధ్వర్యంలోని అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ (ADF)...

గంజాయి, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కమ్మర్‌పల్లి పోలీసులు…

0
గంజాయి, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కమ్మర్‌పల్లి పోలీసులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్‌పల్లి మండల పరిధిలోని మారుతినగర్, హాసాకొత్తూర్ గ్రామం లో కమ్మర్‌పల్లి ఎస్సై శ్రీ. CH.సతీశ్ గారి ఆధ్వర్యంలో...

Translate »
error: Content is protected !!