వావిలాల పాఠశాలలో వనమహోత్సవం…
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, విద్యార్థుల్లో మొక్కల సంరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇలబెల్లి విమలమ్మ విజయ్, ఉపసర్పంచ్ గోన మహేందర్, పంచాయతీ కార్యదర్శి సమ్మయ్య, AAPC చైర్మన్ ఉపేంద్ర, ప్రధానోపాధ్యాయులు పోతుగంటి నర్సయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు, గ్రామ ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పాఠశాల ఆవరణలో నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతను విద్యార్థులు, సిబ్బంది స్వీకరించారు.






















