ధర్పల్లి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా వడ్డెడి గోపి నియామకం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా వడ్డెడి గోపిని నియమించారు. ఈ మేరకు బీజేపీ మండల అధ్యక్షులు జీర్ర మైపాల్ గోపికి నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు వడ్డెడి గోపి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, ఎంపీ ధర్మపురి అరవింద్, మండల అధ్యక్షులు జీర్ర మైపాల్‌కు గోపి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కర్క గంగారెడ్డి, పాల్దిదాసు, రాజశేఖర్, తెడ్డు శంకర్, చంద్రమౌళి, చిలక నరేష్, తిరుపతి, తాళ్ల రాము, మోహన్ తదితరులు పాల్గొన్నారు.






















