భీంగల్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా కాపు కుమ్మరి హరీష్ నియామకం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
భీంగల్ మండలం భీంగల్ పట్టణ కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యదర్శిగా కాపు కుమ్మరి హరీష్ ని నియమించడం జరిగింది.. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచిన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి , డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి కి, బాల్కొండ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ వినయ విధేయతలతో ఉంటానని , నిరంతరామంగా పని చేస్తూ పార్టీ ఎదుగుదలకు కృషిచేస్తానని తెలిపారు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యం గా కష్టపడుతానని తెలిపారు.. పట్టణ ప్రధాన కార్యదర్శిగా భీంగల్ లో ఏ సమస్య తన దృష్టికి వచ్చిన పై అధికారులతో మాట్లాడి సమస్యను తొందరగా పరిష్కరిస్థానని హామీ ఇచ్చారు..నన్ను వెన్నంటి ప్రోత్సహించే భీమ్గల్ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ కి, భీంగల్ పట్టణ అధ్యక్షుడు పర్సా అనంతరావు కి, భీంగల్ మున్సిపాలిటీ చైర్మన్ బోదిరే నాగమణి స్వామి కి , కన్నె సురేందర్ కి తనపై నమ్మకం ఉంచిన తోటి కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..























