భీంగల్ టౌన్ కాంగ్రెస్ కార్యవర్గం ఏర్పాటు…
భీంగల్‌లో కాంగ్రెస్ నూతన కార్యవర్గం నియామకం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణ కాంగ్రెస్ కమిటీకి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కే. నాగేశ్ రెడ్డి ఆదేశాల మేరకు, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చొరవతో భీంగల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పర్స అనంతరావు ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.
ఈ మేరకు భీంగల్ టౌన్ కాంగ్రెస్ కమిటీలో సాయి బాబా, మీశాల నవీన్‌లను వైస్ ప్రెసిడెంట్లుగా నియమించారు. కాపు కుమ్మరి హరీష్, గంగారపు శ్రీకాంత్, చంద్రమ్, గంగమణి, షేక్ ఫిరోజ్‌లను జనరల్ సెక్రటరీలుగా నియమించారు.
అదేవిధంగా రావుట్ల నవీన్, సిర్సు కళ్యాణ్, వెలూరి నాగేశ్, మాదవ్ రెడ్డి, రఫీ, మూతా హరీష్‌లను సెక్రటరీలుగా, బర్ల మోహన్‌ను ట్రెజరీగా నియమిస్తూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కే. నాగేశ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
నూతనంగా నియమితులైన కార్యవర్గ సభ్యులు పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకత్వం సూచించింది. తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన జిల్లా, నియోజకవర్గ, పట్టణ కాంగ్రెస్ నాయకత్వానికి నూతన కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

























