Homeత్రిశూల్ న్యూస్మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట ఆడపిల్లలను చదివించండి TNGOS అంతర్జాతీయ మహిళా దినోత్సవ...

మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట ఆడపిల్లలను చదివించండి TNGOS అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

* మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ
* మహిళా ఉద్యోగులను సన్మానించిన ఎమ్మెల్యే
* కాంగ్రెస్ హయాంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని స్పష్టీకరణ
* మహిళల సౌకర్యార్థం మహిళా భవనాలు

ఆడపిల్లలను ఉన్నతంగా చడిచించినప్పుడే సంపూర్ణ మహిళా సాధికారిత సాధ్యమవుతుందని ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు.  TNGOS జిల్లా శాఖ ఆ సంఘం జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమారు నేతృత్వంలో బుధవారం స్థానిక సంఘ భవనంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో *ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి* ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.అంతకుముందు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ను సంఘం నాయకులు పూల మొక్కను అందజేసి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా TNGOS సంఘం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి  చేపడుతున్న కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రత్యేకనంగా అభినందించారు. అనంతరం కార్యక్రమ అతిథిగా పాల్గొన్న నగర మేయర్ ఉమారాణి దంపతులను శాలువాతో సత్కరించారు. అటు మరోవైపు మహిళా ఉద్యోగులను ఘనంగా సన్మానించి,ప్రశంస పత్రాలను అందజేశారు. మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.ఇటీవల TNGOS నిమిత్తం తన నియోజకవర్గంలో ఎకరం భూమి కేటాయించడం పట్ల TNGOS సంఘం వారు ఎమ్మెల్యే కు ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపారు. కాగా ఉద్యగుల సౌకర్యార్థం కళ్యాణ మండపం ఏర్పాటు,ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్లు తదితర అంశాలను గురించి చేయాలని విన్నవించగా అందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తప్పకుండా సహకరిస్తానని తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదంతో పాటు అసెంబ్లీ లో ప్రస్తావిస్తానని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డిని గజమాలతో సన్మానించారు.ఈ మేరకు ఎమ్మేల్యే డా.ఆర్.భూపతి రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు రూపొందిస్తే..వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఉద్యోగస్థులదే కీలక పాత్ర అన్నారు. కాబట్టి ఉద్యోగస్తులు బాధ్యతాయుతంగా పని చేసి..ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చివరి లబ్ధిదారునికి అందేలా పనిచేయాలని సూచించారు. ఉద్యోగులు అందరూ తమ తమ పిల్లలను ముఖ్యంగా ఆడపిల్లలను పెళ్లి పేరిట సంకెళ్లు వేయకుండా.. ఉన్నత చదువులు చదివించాలని అప్పుడే మహిళా సాధికారత సాధ్యపడుతుందని తెలిపారు.తన నియోజకవర్గం సుమారు 160కి పైగా మహిళా సంఘ భవనాలు నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ రూరల్ మండల అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్,పార్టీ నాయకులు రామచందర్ గౌడ్,అంబర్ సింగ్,డివిజన్ 1 కార్పొరేటర్ అగ్గు బోజన్న, TNGOS రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారాం,రాష్ట్ర కార్యదర్శి పోలా శ్రీనివాస్, జిల్లా సహాయ అద్యక్షులు నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి నేతికుంట శేఖర్, మహిళా కార్యవర్గ సభ్యురాలు సునీత,ఇందిరా,గీతారెడ్డి,మంగమ్మ మహిళా ఉద్యోగస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్…

0
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... పాత కక్షలతో గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఈరోజు అరెస్ట్...

డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి…

0
డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పందించాలి...

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి... డిగ్రీ కళాశాల భూములలో ఏర్పాటు చేయాలి... టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్...

Translate »
error: Content is protected !!