Homeతెలంగాణనిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ఢీకొని వృద్ధ ప్రయాణికురాలు మృతి...

నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ఢీకొని వృద్ధ ప్రయాణికురాలు మృతి…

నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ఢీకొని వృద్ధ ప్రయాణికురాలు మృతి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ డిపో–1కు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ వృద్ధ ప్రయాణికురాలు మృతి చెందినట్లు సమాచారం.

ఆగస్టు 25న జరిగిన ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బస్టాండ్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీని పూర్తిస్థాయిలో పరిశీలించి ప్రమాదానికి అసలు కారణాలను వెలుగులోకి తేవాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు.

ప్రమాదంలో మృతిచెందిన మహిళకు సంబంధించిన వారు అక్కడ లేకపోవడంతో ఘటనకు సంబంధించిన వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి రాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, మహిళ ఫిట్స్‌తో మృతి చెందినట్లు ప్రచారం జరుగుతుండటంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రయాణికుల కథనం ప్రకారం, మహిళ నుదుటి కుడివైపు గాయమైందని, ముక్కు, చెవి నుంచి రక్తస్రావం జరిగినట్లు చెబుతున్నారు. బస్సు ఢీకొనడం వల్లే ఈ గాయాలు అయ్యాయా? లేక మరేదైనా కారణమా? అనే విషయాన్ని సీసీ కెమెరా ఫుటేజీ, వైద్య నివేదికలు, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది.

బస్టాండ్ పరిధిలో ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమైతే, విచారణ అనంతరం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఏది ఏమైనా, వృద్ధ మహిళ మృతికి అసలు కారణం ఏమిటో నిగ్గుతేల్చేందుకు అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని, బస్టాండ్‌లోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి నిజానిజాలను ప్రజల ముందుకు తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బడా భీంగల్‌లో యూరియా కోసం రైతుల ధర్నా…

0
బడా భీంగల్‌లో యూరియా కోసం రైతుల ధర్నా... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ బడా భీంగల్, ఆగస్టు 27: పంటలను కాపాడుకునేందుకు అవసరమైన యూరియాను సకాలంలో అందించాలని డిమాండ్ చేస్తూ బడా భీంగల్ గ్రామంలోని...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి భేటీ…

0
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి భేటీ  నియోజకవర్గ అభివృద్ధి పై చర్చ   సీఎం ను శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు...

ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు…

0
ఈద్ ఏ మిలాద్ ఉన్ నబి 1501 జన్మదిన వేడుకలు...  ఏ గణేష్ పటేల్ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ పోతంగల్ ఆగస్టు 26: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో బుధవారం రోజున ముస్లిం సహోదరులు...

మరుగుతున్న మహాసముద్రం…

0
మరుగుతున్న మహాసముద్రం 'ఎల్ నినో'తో పొంచి ఉన్న పెను ముప్పు ప సిఫిక్ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.6 డిగ్రీలుగా నమోదు 1877 రికార్డు బద్దలుకొడుతూ గరిష్ట ఉష్ణోగ్రతలు వాతావరణ సమతుల్యత భారీగా గతితప్పే...

వీధి కుక్కలతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. సర్పంచ్ చలిమెల శ్రీనివాస్…

0
వీధి కుక్కలతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. సర్పంచ్ చలిమెల శ్రీనివాస్.. త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి గ్రామంలో వీధి కుక్కల బెడద నేపథ్యంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...

Translate »
error: Content is protected !!