ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి భేటీ
నియోజకవర్గ అభివృద్ధి పై చర్చ
సీఎం ను శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డా. ఆర్. భూపతి రెడ్డి బుధవారం సాయంత్రం హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శాలువాతో సత్కరించారు.
భేటీలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రితో ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి చర్చించారు. నియోజకవర్గంలో ప్రస్తుతం కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి, వాటి అమలు తీరు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలు తదితర అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన భవిష్యత్ అభివృద్ధి పనులపై కూడా ముఖ్యమంత్రితో చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

























