బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి జన్మదిన వేడుకలు…
ధర్పల్లిలో శివాలయంలో ప్రత్యేక అభిషేకం, అర్చనలు
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్పల్లి మండల బీజేపీ అధ్యక్షులు జీరా మహిపాల్, ఆధ్వర్యంలో శివాలయంలో ప్రత్యేక అభిషేకం, అర్చనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దినేష్ కులాచారి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జిగా, పార్టీ నాయకుడిగా ఎన్నో సేవలు అందించారని తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు, పార్టీకి మరిన్ని సేవలు అందించాలని, ఆయన ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జీరా మహిపాల్, కోమటి దాసు, కర్క గంగారెడ్డి, సరి చందు, దోర్నాల రాజశేఖర్, అమ్రు నాయక్, సేవాలాల్, నరేష్, మురళి, రవీందర్, తాళ్ల రాము, రామ్ చందర్, తిరుపతి, మోహన్, గోపి, భగత్, భాస్కర్, గోపాల్, శ్రీకాంత్, వెల్దుర్తి రవి, గంగాధర్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

























