సఫాయి కార్మికులకు సత్కారం….
ప్రతి పుట్టినరోజుకు కానుకలతో పలకరింపు…
మలినాలెత్తిన చేతులకు మద్దతు తెలిపాలి – మంద మహిపాల్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్…
నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మంద మహిపాల్ సతీమణి శ్రావణి ప్రియ మహిపాల్ జన్మదిన సందర్భాన్ని పరిష్కరించుకొని ఆదివారం వారి నివాసం వద్ద గ్రామపంచాయతీ కార్మికులను ఘనంగా సన్మానించి వారికి బట్టలను పంపిణీ చేశారు.
ఆమె జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం గ్రామపంచాయతీ కార్మికులకు, లేదంటే అంగన్వాడి, ఆశా వర్కర్లను ఘనంగా సన్మానించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ…. సమాజ అభివృద్ధిలో ముందు వరుసలో నిలబడి సేవ చేసేవారిని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వివిధ సంస్థలలో రకరకాల కార్మికులు పనిచేస్తున్నా… సపాయి కార్మికుల పనివేరని… మనం చీదరించుకునే పనులను వారి చేతులతో ముట్టి శుభ్రం చేసే గొప్ప మానవతామూర్తులని కొనియాడారు. ఆ మలినాలెత్తిన చేతులను మరవకుండా మనకు తోచిన విధంగా వారిని గుర్తించి మేమున్నామంటూ చిన్న చిన్న కానుకలతో తోడ్పాటును అందించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. అందుకే నా సతీమణి జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం చిరు కానుకలతో వారిని సన్మానించుకోవడం జరుగుతుందని అన్నారు. పెళ్లిరోజు, పుట్టినరోజు వేడుకలను ఇలాంటి కార్మికుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. శ్రావణి ప్రియ మహిపాల్ మాట్లాడుతూ…. సమాజ సేవ, కార్మికుల కష్టసుఖాల పలకరింపు, ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే ఆలోచన విధానం మంద మహిపాల్ సొంతమని, జన్మదిన వేడుకలను విలాసవంతంగా జరుపుకోకుండా ఇలా కార్మికుల మధ్య జరుపుకోవడం మర్చిపోలేని అనుభూతి అని, సమాజం బాగుండాలనే ఆయన ఆలోచనలకు ఎల్లప్పుడూ నా వంతు మద్దతు తెలుపుతానని అన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు, లయన్స్ క్లబ్ సభ్యులు, గ్రామపంచాయతీ కార్మికులు, యువకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

























