యోగాతో పాటు మొక్కలు నాటుతూ..ఆలయాలను శుభ్రపరుస్తున్న భీంగల్ యోగ బృందం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
ఆలయాల శుద్ధి కార్యక్రమంలో భాగంగా ఆదివారం భీమ్‌గల్ యోగా బృందం నందీశ్వర ఆలయంలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టింది. ఈ సందర్భంగా యోగా సభ్యులు మాట్లాడుతూ.. పచ్చదనం పరిరక్షణే ధ్యేయంగా 10 వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటుతూ వాటిని సంరక్షిస్తున్నామని తెలిపారు. మొక్కల పెంపకంతో పాటు ఆలయ ప్రాంగణాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.























