కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగ దొరికాడు….
మండల కేంద్రంలో ఓ ఇంట్లో చోరీ చేసి పది తులాల బంగారు అపహరణ…
దొరికినట్టే దొరికి అప్పటినుండి తప్పించుకుంటూ తిరుగుతున్న దొంగ….
పట్టు వీడకుండా సీఐ జాన్ రెడ్డి ప్రాణాలకు తెగించి మరీ పట్టుకున్న వైనం….
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్
నందిపేట ఆగస్టు 30 త్రిశూల్ న్యూస్ : నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్ర బర్కత్ పుర కాలనీ గాంధీ మెడికల్ మైముద్ ఇంట్లో ఫిబ్రవరి నెలలో పట్టపగలే ఇంట్లో చొరబడి పది తులాల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసును సవాలుగా తీసుకొని చుట్టుపక్కల ప్రాంతంలోని సీసీ కెమెరాల ఆధారంగా వేట మొదలు పెట్టారు. చోరీకి పాల్పడ్డ దుండగుల కోసం సీఐ జాన్ రెడ్డి పట్టు వీడకుండా రాష్ట్రాలను దాటి మరి వేటను కొనసాగించారు. 23 సంవత్సరాల నిందితుడు షేక్ కయ్యుం రఫిక్ బేగ్ కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగ, మహారాష్ట్ర పర్బాని కి చెందిన ఈ దొంగ పై మహారాష్ట్ర, కర్ణాటక లలో పలు కేసులు ఉన్నాయి. అంతేకాకుండా మహారాష్ట్ర కొత్వాలు స్టేషన్ పరిధిలో నాలుగు పిస్టల్స్ ను స్వాధీనం చేసుకున్న కేసులో మూడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. మళ్లీ అదే స్టేషన్ పరిధిలో తుపాకి అమ్మి ఇప్పటివరకు తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ గరుడుగట్టిన దొంగను పట్టుకునేందుకు సీఐ జాన్ రెడ్డి ప్రయత్నిస్తుండగా ఒకానొక సమయంలో సిఐ పై దాడి చేసి తప్పించుకోవడం కూడా జరిగిందని సమాచారం. నిందితుడు దొంగిలించిన సొత్తును అమ్మేందుకు నిజాంబాద్ వైపు వెళుతుండగా నవీపేట్ రైల్వే స్టేషన్ దగ్గర సిఐ తన సిబ్బందితో చాకచక్యంగా పట్టుకొని, చోరీ చేసిన సొమ్మును రికవరీ చేసి దొంగను రిమాండ్ పంపారు. కడుగట్టిన నేరస్తున్ని పట్టుకున్న పోలీసులపై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి విధి నిర్వహణ చేసిన సీఐ జాన్ రెడ్డి, ఎస్సై వినయ్ కుమార్, పోలీస్ సిబ్బంది నరేందర్, అనిల్, శ్రీనివాస్, షబ్బీర్, మహిపాల్ లను ఉన్నతాధికారులు అభినందించారు.























