భక్తిశ్రద్ధలతో ఏనుగందుల కృష్ణ హరి రజనిత గారి నివాసంలో దైవ యజ్ఞం..
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…
కామారెడ్డి పట్టణంలోని ఏనుగందుల కృష్ణ హరి రజనిత నివాసంలో ఆదివారం దైవ యజ్ఞ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. యోగ సభ్యులు వేద పండితుల మంత్రోచ్చారణలు, యజ్ఞాగ్ని వెలుగులతో ఇల్లు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.
కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, యజ్ఞంలో పాల్గొన్నారు. కుటుంబానికి ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, ఐశ్వర్యం కలగాలని పండితులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యజ్ఞ కార్యక్రమానికి బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు పాల్గొన్నారు.
అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, ఇంట్లో దైవ యజ్ఞం నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మిక ప్రశాంతత, కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతాయని తెలిపారు. దైవ నామస్మరణతో జరిగిన ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో యోగ గురువు అంతిరెడ్డి, వెంకటస్వామి, వెంకటరాజం,అధ్యక్షులు కృష్ణమూర్తి, మల్లారెడ్డి, లింగం చారి, భారతి పాల్గొన్నారు..

























