Homeతెలంగాణగణేష్ మండపాలకు పటిష్ట భద్రత...

గణేష్ మండపాలకు పటిష్ట భద్రత…

గణేష్ మండపాలకు పటిష్ట భద్రత

జియో ట్యాగింగ్, సీసీ కెమెరాలతో నిఘా.. నిమజ్జనానికి ప్రత్యేక బందోబస్తు: సీపీ సాయి చైతన్య…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్: గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గణేష్ మండపాల వద్ద పోలీస్ నిఘాను పటిష్టం చేసినట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు. గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 5,681 గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో నిజామాబాద్ డివిజన్‌లో 2,545, ఆర్మూర్ డివిజన్‌లో 1,959, బోధన్ డివిజన్‌లో 1,177 విగ్రహాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

ప్రతి గణేష్ మండపాన్ని జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేసినట్లు సీపీ తెలిపారు. బ్లూకోర్ట్స్ సిబ్బంది క్షేత్రస్థాయిలో మండపాలను సందర్శించి వివరాలను సేకరించి పోలీస్ వెబ్ అప్లికేషన్ ద్వారా జియో ట్యాగింగ్ చేస్తున్నట్లు చెప్పారు. దీంతో ప్రతి మండపానికి సంబంధించిన పూర్తి సమాచారం పోలీసులకు అందుబాటులో ఉంటుందని, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు సంఘటనా స్థలానికి త్వరగా చేరుకునేందుకు వీలవుతుందని తెలిపారు.

మండపాల వద్ద భద్రత కోసం బ్లూకోర్ట్స్, పెట్రోకార్ సిబ్బంది మూడు షిఫ్టుల్లో నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారని చెప్పారు. మండపాలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ నిర్వాహకులకు భద్రతా సూచనలు ఇస్తున్నట్లు తెలిపారు.

గణేష్ నిమజ్జనం సందర్భంగా నిజామాబాద్‌లోని ప్రధాన నిమజ్జన మార్గంలో సుమారు 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు. వీటిని పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసి 24 గంటల పాటు పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సీపీ సాయి చైతన్య కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ప్లాస్టిక్ నిర్మూలనకు వినూత్న చర్య…

0
ప్లాస్టిక్ నిర్మూలనకు వినూత్న చర్య... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి మండలంలోని సీతయ్యపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని గుడి తండా పంచాయితీ తరపున స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు ఎంపీడీఓ మారుతి...

భీంగల్ మున్సిపాలిటీలో కుక్కల బెడదపై చర్యలు…

0
భీంగల్ మున్సిపాలిటీలో కుక్కల బెడదపై చర్యలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ మున్సిపాలిటీ పరిధిలో కుక్కల బెడదపై మున్సిపల్ అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ తరఫున...

అఖిలభారత రైతు కూలీ సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయండి…

0
అఖిలభారత రైతు కూలీ సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయండి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ ఖమ్మంలో సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న అఖిలభారత రైతు కూలీ సంఘం నాల్గవ జాతీయ మహాసభలను...

ధర్మశాలలో ఘనంగా సామూహిక హనుమాన్ చాలీసా…

0
ధర్మశాలలో ఘనంగా సామూహిక హనుమాన్ చాలీసా భక్తిశ్రద్ధలతో పాల్గొన్న హిందూ వాహిని కుటుంబ సభ్యులు, భక్తులు త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి పట్టణంలోని ధర్మశాలలో హిందూ వాహిని ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమం...

మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మాణం చేపడితే చర్యలు తప్పవు…

0
మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మాణం చేపడితే చర్యలు తప్పవు. -నూతన గృహాలు, మడిగెలు, కమర్షియల్ షట్టర్లకు అనుమతి తప్పనిసరి కమిషనర్ డి. గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ పట్టణ పురపాలక సంఘం పరిధిలో...

Translate »
error: Content is protected !!