Homeతెలంగాణ51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి.. ఆరు డీఏలను ప్రకటించాలి...

51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి.. ఆరు డీఏలను ప్రకటించాలి…

51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి.. ఆరు డీఏలను ప్రకటించాలి

EHSను పకడ్బందీగా అమలు చేయాలి: డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి. దాసు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీమ్‌గల్: ప్రభుత్వం పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని ఉద్యోగ, ఉపాధ్యాయులకు 51 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి. దాసు డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే ప్రకటించాలని, EHS అమలుపై నెలకొన్న గందరగోళాన్ని తొలగించి పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.

డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం. బాలయ్య మాట్లాడుతూ.. డీఈఓ, డిప్యూటీ ఈఓ, ఎంఈఓ, డైట్ లెక్చరర్లు, సీనియర్ లెక్చరర్లు, ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని కోరారు. కామన్ సర్వీస్ రూల్స్‌ను పరిష్కరించడంతో పాటు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కేజీబీవీల్లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్, ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయులతో సమానంగా అన్ని రకాల సెలవుల సౌకర్యం కల్పించాలని కోరారు. పని విధానాల్లో స్పష్టమైన వర్క్ డివిజన్, ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు జీరో వన్ జీరో కింద వేతనాలు చెల్లించాలని, కారుణ్య నియామకాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అనంతరం భీమ్‌గల్ మండలంలోని జాగిర్యల్, కుప్కల్, బెజ్జోరా, ముచ్కూర్, పిప్రి, బాచన్‌పల్లి, కేజీబీవీ తదితర పాఠశాలలను సందర్శించి డీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి. దాసు, జిల్లా అధ్యక్షుడు ఎం. బాలయ్య, కార్యదర్శి షేక్ మదర్, భీమ్‌గల్ మండల ప్రధాన కార్యదర్శి గట్టు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ప్లాస్టిక్ నిర్మూలనకు వినూత్న చర్య…

0
ప్లాస్టిక్ నిర్మూలనకు వినూత్న చర్య... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి మండలంలోని సీతయ్యపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని గుడి తండా పంచాయితీ తరపున స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు ఎంపీడీఓ మారుతి...

భీంగల్ మున్సిపాలిటీలో కుక్కల బెడదపై చర్యలు…

0
భీంగల్ మున్సిపాలిటీలో కుక్కల బెడదపై చర్యలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ మున్సిపాలిటీ పరిధిలో కుక్కల బెడదపై మున్సిపల్ అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ తరఫున...

అఖిలభారత రైతు కూలీ సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయండి…

0
అఖిలభారత రైతు కూలీ సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయండి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ ఖమ్మంలో సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న అఖిలభారత రైతు కూలీ సంఘం నాల్గవ జాతీయ మహాసభలను...

ధర్మశాలలో ఘనంగా సామూహిక హనుమాన్ చాలీసా…

0
ధర్మశాలలో ఘనంగా సామూహిక హనుమాన్ చాలీసా భక్తిశ్రద్ధలతో పాల్గొన్న హిందూ వాహిని కుటుంబ సభ్యులు, భక్తులు త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి పట్టణంలోని ధర్మశాలలో హిందూ వాహిని ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమం...

మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మాణం చేపడితే చర్యలు తప్పవు…

0
మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మాణం చేపడితే చర్యలు తప్పవు. -నూతన గృహాలు, మడిగెలు, కమర్షియల్ షట్టర్లకు అనుమతి తప్పనిసరి కమిషనర్ డి. గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ పట్టణ పురపాలక సంఘం పరిధిలో...

Translate »
error: Content is protected !!