ప్రతి కుటుంబ అవసరాలను గుర్తించి ప్రణాళిక రూపొందించాలి ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీమ్‌గల్: మహిళా సంఘాల్లోని ప్రతి కుటుంబం కనీస అవసరాలను గుర్తించి, మహిళా సంఘాల సమావేశాల్లో చర్చించి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ సూచించారు.
భీమ్‌గల్ ఐకేపీ కార్యాలయంలో వీవీఏలకు విలేజ్ పావర్టీ రిడక్షన్ ప్లాన్ (వీపీఆర్పీ) ప్రణాళిక తయారీపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామస్థాయిలో ప్రతి కుటుంబానికి ఉన్న అవసరాలను గుర్తించి, వాటిని ప్రధాన అంశాలుగా వర్గీకరించాలని సూచించారు.
అత్యవసరమైన అంశాలకు ప్రాధాన్యత కల్పించి, వాటిని ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అనుసంధానం చేయడమే వీపీఆర్పీ ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని వివరించారు.
వీపీఆర్పీలో భాగంగా అక్టోబర్ 2న అన్ని గ్రామాల్లో వివిధ శాఖల అధికారుల సమన్వయంతో గ్రామసభలు నిర్వహించి, ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో ప్రణాళిక రూపొందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎం ప్రమీల, ఏపీఓ నర్సయ్య, సీసీలు, వీవీఏలు పాల్గొన్నారు.

























