58 గ్రామపంచాయతీలకు రూ.33.62 కోట్లు విడుదల: మంత్రి సీతక్క…
తెలంగాణ : కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల ఎన్నికలు జరగని 58 గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.33.62 కోట్లు విడుదల చేసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఎన్నికలు జరగలేదన్న కారణంతో కేంద్ర ఆర్థిక సంఘం నుండి నిధులు అందకపోయినా, గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా నిధులు సమకూర్చినట్లు సోమవారం విలేకరుల సమావేశంలో చెప్పారు. ప్రతి పంచాయతీని మాడల్ పంచాయతీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.























