దివ్యాంగ విద్యార్థులకు మండల స్థాయి క్రీడా పోటీలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్
కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో దివ్యాంగ విద్యార్థుల కోసం మండల స్థాయి క్రీడా పోటీలు ఉత్సాహభరితంగా నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన దివ్యాంగ విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి (MEO) ఆంధ్రయ్య హాజరై క్రీడా పోటీలను ప్రారంభించి, విద్యార్థులను ఉత్సాహపరిచారు. విశిష్ట అతిథిగా MPDO సదాశివ పాల్గొని దివ్యాంగ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంలో ఇటువంటి క్రీడా పోటీలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
కాంప్లెక్స్ హెచ్‌ఎం పి. సాయన్న, స్పెషల్ ఎడ్యుకేటర్ మధుశేఖర్, IERP రాజన్న కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అవసరమైన సహకారం అందించారు. CRPలు అంజయ్య, రాజేష్, లలిత కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములయ్యారు.
వివిధ క్రీడా పోటీలలో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన విద్యార్థులకు ముఖ్య అతిథులు మరియు ఇతర అతిథుల చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. దివ్యాంగ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రీడాస్ఫూర్తి, సమాన అవకాశాల భావన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.

























