రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం. వ్యక్తికి తీవ్ర గాయాలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ వైకుంఠం
నిజామాబాద్: కుటుంబ సభ్యులతో జరిగిన గొడవ కారణంగా ఓ వ్యక్తి రైల్వే పట్టాలపై పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా చల్లగారికి గ్రామానికి చెందిన శ్యామ బాల గౌడ్ ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం.
రైలు వస్తున్న సమయంలో ఆయన పట్టాలపై పడుకోగా, రైలు నెమ్మదిగా రావడంతో ఆయనకు తల, కాలికి గాయాలైనట్లు తెలిసింది. కుటుంబ సభ్యులతో జరిగిన గొడవే ఈ ఘటనకు కారణమని ఆయన తెలిపినట్లు సమాచారం.
వెంటనే స్పందించిన స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించి, బాధితుడిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్య చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

























