ధర్పల్లి: నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని మోయిన్ సాబ్ తండాలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి ప్రారంభించారు.
నూతన గ్రామపంచాయతీ భవనం అందుబాటులోకి రావడంతో గ్రామస్థులకు స్థానిక పాలన సేవలు మరింత చేరువ కానున్నాయి. అలాగే గ్రామ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు ఈ భవనం ఉపయోగపడనుంది.
ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాల్రాజ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చెలిమెల శ్రీనివాస్, సర్పంచ్ బాలు నాయక్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

























