స్వల్ప బాండ తండాలో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవం…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని స్వల్ప బాండ తండాలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గ్రామస్థులకు పాలనా సేవలు మరింత చేరువ కావడానికి గ్రామపంచాయతీ భవనం ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామావత్ రమేష్ నాయక్, డిసిసి ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్, మండల అధ్యక్షులు గాదే నరేష్. చెలిమెల శ్రీనివాస్. చక్రపాణి. సుభాష్. సురేందర్ గౌడ్. లాల్ సింగ్. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

























