ధర్పల్లి ఆదర్శ పాఠశాలలో క్రీడా వసతులకు రూ.60 లక్షలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఇండోర్ అవుట్డోర్ క్రీడా వసతుల అభివృద్ధికి రూ.60 లక్షలతో చేపట్టనున్న పనులకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో క్రికెట్, వాలీబాల్ క్రీడలకు మెరుగైన వసతులు కల్పించనున్నారు కార్యక్రమంలో డిసిసి వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాల్రాజ్, సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, గాదె నరేష్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్. కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుభాష్. సురేందర్ గౌడ్. మరియు ఎంపీడీవో బి మారుతి.ఎమ్మార్వో టి శాంత. మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

























