తల్లి, ఇద్దరు కూతుళ్లు అదృశ్యం
ఎల్లారెడ్డి పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన సరిత (30) తన ఇద్దరు కుమార్తెలతో కలిసి అదృశ్యమైంది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 26-10-2026న ఉదయం సుమారు 11 గంటల సమయంలో సరిత తన కుమార్తెలు వైష్ణవి (8), సంగిక (6)తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
సరిత తల్లి గంగుల భూమమ్మ తన కుమార్తెతో పాటు మనవరాళ్ల ఆచూకీ కోసం పలు చోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. అదృశ్యమైన ముగ్గురి ఆచూకీ కోసం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

























