ధర్పల్లి కస్తూర్బా పాఠశాలలో మౌలిక వసతులకు భూమిపూజ…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మౌలిక వసతుల కల్పన కోసం ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి భూమిపూజ నిర్వహించారు. విద్యార్థినులకు అవసరమైన సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చేపట్టనున్న అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. విద్యార్థినుల విద్యాభివృద్ధితో పాటు పాఠశాలల్లో మౌలిక వసతుల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు బాలరాజ్ గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ చక్రపాణి పుప్పాల సుభాష్ సురేందర్ గౌడ్ ధర్పల్లి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

























