ధర్పల్లిలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ
మోబిన్సాబ్, ఎస్బీ తండాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలు ప్రారంభం…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి: ధర్పల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ధర్పల్లి గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. అలాగే మోబిన్సాబ్, ఎస్బీ తండాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు.
మహిళా సమాఖ్య భవన నిర్మాణం పూర్తయితే మహిళా సంఘాల సమావేశాలు నిర్వహించుకోవడంతో పాటు, మహిళలకు సంబంధించిన కార్యక్రమాలకు అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. గ్రామ పంచాయతీలకు నూతన భవనాలు అందుబాటులోకి రావడంతో గ్రామస్థాయి పాలనకు, ప్రజలకు అవసరమైన సేవలు అందించడానికి సౌకర్యం కలగనుంది.
ఈ కార్యక్రమాల్లో డీసీసీ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె నరేశ్, సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ఉపసర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్, గ్రామ శాఖ అధ్యక్షులు చక్రపాణి, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేపడుతున్న పనుల్లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు.

























