ధర్పల్లిలో పోలీసుల వాహన తనిఖీలు
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు..
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం ఎస్సై జి. సందీప్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై సందీప్ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది మలావత్ సంతోష్, రవీందర్, సంగీత, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

























