Homeకామారెడ్డి జిల్లాతలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ...

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ…

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ

రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం: దోమకొండ ఎస్సై ప్రభాకర్, డాక్టర్ బాలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

దోమకొండ: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని దోమకొండ ఎస్సై ప్రభాకర్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు అన్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఉగాది సిండికేట్, పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 28 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎస్సై ప్రభాకర్, డాక్టర్ బాలు రక్తదాతలను అభినందించారు. ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న బాలె సురేందర్, మ్యాక నాగరాజులను వారు ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 7 వేల మందికి పైగా చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. ఈ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం అవసరమవుతుందని, వారి జీవితాలను కాపాడేందుకు యువత రక్తదాన శిబిరాల నిర్వహణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

రక్తదాన శిబిరాల నిర్వహణకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలను కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్), ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీల ఆధ్వర్యంలో అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహించి తలసేమియా చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు కృషి చేస్తామని తెలిపారు.

రక్తానికి ప్రత్యామ్నాయం లేదు

రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేయాలని డాక్టర్ బాలు కోరారు. సకాలంలో రక్తాన్ని అందించడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. శిబిరంలో రక్తదానం చేసిన దాతలకు ప్రశంసాపత్రాలు, స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేశారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు అందె గణేశ్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది బట్టు భరద్వాజ్, డాక్టర్ అజయ్, టెక్నీషియన్లు సతీశ్, గౌతమ్, భారత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు…

0
భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు జంగం మోహన్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌.. డప్పుల దండోరాతో ప్రజావాణికి చేరుకున్న నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం...

పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం…

0
పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం: ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: పౌర్ణమి సందర్భంగా శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్...

ముదిరాజ్‌ కులాన్ని బీసీ-ఏలో చేర్చవద్దు…

0
ముదిరాజ్‌ కులాన్ని బీసీ-ఏలో చేర్చవద్దు బీసీ కమిషన్‌కు గంగపుత్ర సంఘం ప్రతినిధుల వినతిపత్రం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: ముదిరాజ్‌ కులాన్ని బీసీ-డీ నుంచి బీసీ-ఏ వర్గంలోకి మార్చే ప్రతిపాదనపై తమ అభ్యంతరాలను పరిగణనలోకి...

ఆదర్శంగా నిలిచిన చిన్నారి ఐరా పుట్టినరోజు వేడుకలు…

0
ఆదర్శంగా నిలిచిన చిన్నారి ఐరా పుట్టినరోజు వేడుకలు ఎల్‌నినో ప్రభావంతో కష్టాలు ఎదుర్కొంటున్న వేళ.. 12 మంది పేదలకు నిత్యావసర సరుకులు, 100 మందికి అన్నదానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: పుట్టినరోజు వేడుకలను...

నందిపేట్‌లో ఫామ్ పాండ్ నిర్మాణ పనులు ప్రారంభం…

0
నందిపేట్‌లో ఫామ్ పాండ్ నిర్మాణ పనులు ప్రారంభం వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం చర్యలు... నందిపేట్: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో, వర్షపు నీటిని నిల్వ చేసుకోవడంతో...

Translate »
error: Content is protected !!