బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్: భీంగల్ మండలంలోని పిప్రి, పల్లికొండ గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను కాంగ్రెస్ నాయకుడు మానాల మోహన్ రెడ్డి పరామర్శించి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
పిప్రి గ్రామంలో మాజీ ఎంపీటీసీ స్వామి అత్తమ్మ పొప్పుల గంగామణి ఇటీవల మృతి చెందడంతో, ఆమె కుటుంబ సభ్యులను మానాల మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
అనంతరం పల్లికొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కిషన్ అన్న కుమార్తె సుమలత ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భీంగల్ మున్సిపల్ బోదిరే స్వామి, జేజే నర్సయ్య, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నాగేంద్ర, కన్నె సురేందర్, ఉపసర్పంచ్ జేమ్స్, రత్నం, సురేష్, గోపాల్, మునీర్, రమేష్, రాజేష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

























