Homeతెలంగాణఆదర్శంగా నిలిచిన చిన్నారి ఐరా పుట్టినరోజు వేడుకలు...

ఆదర్శంగా నిలిచిన చిన్నారి ఐరా పుట్టినరోజు వేడుకలు…

ఆదర్శంగా నిలిచిన చిన్నారి ఐరా పుట్టినరోజు వేడుకలు

ఎల్‌నినో ప్రభావంతో కష్టాలు ఎదుర్కొంటున్న వేళ.. 12 మంది పేదలకు నిత్యావసర సరుకులు, 100 మందికి అన్నదానం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీమ్‌గల్: పుట్టినరోజు వేడుకలను ఆడంబరాలకు దూరంగా, సేవా కార్యక్రమాలతో నిర్వహించి చిన్నారి గుమ్ముల ఐరా కుటుంబం ఆదర్శంగా నిలిచింది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామానికి చెందిన గుమ్ముల ఉపేందర్, శిరీష దంపతులు తమ కుమార్తె ఐరా మొదటి పుట్టినరోజు సందర్భంగా భీమ్‌గల్ మండలం మెండోరా, వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామాల్లో పేదలకు సహాయం అందిస్తూ వేడుకలను వినూత్నంగా నిర్వహించారు.

సాధారణంగా పుట్టినరోజు వేడుకల కోసం కేకులు, ఫ్లెక్సీలు, ఇతర ఆడంబరాలపై ఖర్చు చేసే బదులు, సుమారు రూ.30 వేలతో నిత్యావసర సరుకుల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించారు.

12 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

ఐకేపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగారెడ్డి ద్వారా సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, ఐఏఎస్ సేవా భావనతో స్ఫూర్తి పొందిన గుమ్ముల ఉపేందర్, శిరీష దంపతులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

భీమ్‌గల్ మండలం మెండోరా గ్రామం, వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామాల్లో మొత్తం 12 మంది నిరుపేద కుటుంబాలను ఎంపిక చేసి, ఒక్కొక్క కుటుంబానికి 15 రోజుల పాటు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. బియ్యం, పప్పులు, ఫ్రీడమ్ వంటనూనె, కొబ్బరి నూనె, ఆశీర్వాద్ ఆటా, కారం, పసుపు తదితర సరుకులను అందజేశారు. ఈ సరుకుల విలువ సుమారు రూ.20 వేలుగా తెలిపారు.

100 మందికి అన్నదానం

అదేవిధంగా శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 మంది నిరుపేదలకు చికెన్ బిర్యానీ, వాటర్ బాటిళ్లతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకోసం సుమారు రూ.10 వేలు ఖర్చు చేశారు. పుట్టినరోజు వేడుకను పేదల ఆకలి తీర్చే కార్యక్రమంగా మార్చి, సామాజిక సేవకు ప్రాధాన్యతనిచ్చారు.

రామన్నపేట గ్రామంలో సర్పంచ్ నవీన్, గుమ్ముల ధర్మారెడ్డి, సురేష్, రమేష్, కుటుంబ సభ్యుల చేతుల మీదుగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మెండోరా గ్రామంలో సర్పంచ్ కుంట లక్ష్మీ రమేష్, కుంట గిర్ని రాజన్న, కుంట గంగారెడ్డి, పల్లె శేఖర్ తదితరులు పేదలకు సరుకులు అందజేశారు.

చిన్నారి పుట్టినరోజుతో సామాజిక సేవకు ప్రాధాన్యం

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, పుట్టినరోజు వేడుకల పేరుతో అనవసర ఆడంబరాలకు ఖర్చు చేయకుండా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం, అన్నదానం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. చిన్న వయస్సు నుంచే పిల్లలకు సేవాభావం, సమాజం పట్ల బాధ్యతను తెలియజేసేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో పేద కుటుంబాలకు అండగా నిలవడం ఎంతో అవసరమని, గుమ్ముల ఉపేందర్, శిరీష దంపతులు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని గ్రామస్తులు కొనియాడారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మరియ తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ…

0
మరియ తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని మరియ తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు నిజామాబాద్ రూరల్...

నషా ముక్త్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..

0
నషా ముక్త్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి వ్యాస రచన,ర్యాలీ కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సూచనల మేరకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని...

సీతారాంపూర్‌ పాఠశాలకు టీవీ అందజేత…

0
సీతారాంపూర్‌ పాఠశాలకు టీవీ అందజేత డిజిటల్‌ తరగతులు, వీడియో పాఠాలకు ఉపయోగం: సర్పంచ్‌ సంజీవ్‌ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ మండలం సీతారాంపూర్‌ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు గ్రామ సర్పంచ్‌ నత్తి సంజీవ్‌, వార్డు...

రామారెడ్డిలో వైభవంగా కాలభైరవ స్వామి పూజలు…

0
రామారెడ్డిలో వైభవంగా కాలభైరవ స్వామి పూజలు భక్తులతో కిటకిటలాడిన ఆలయం.. అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం రామారెడ్డి: మండలంలోని ఇసన్నపల్లి కాలభైరవ స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు అత్యంత...

ధర్పల్లిలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ…

0
ధర్పల్లిలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ మోబిన్సాబ్‌, ఎస్బీ తండాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలు ప్రారంభం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి: ధర్పల్లి మండలంలో...

Translate »
error: Content is protected !!