డిచ్‌పల్లి బస్టాండ్‌లో వీధి దీపాలు కరువు.. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు!
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలోని బస్టాండ్‌లో గత నెల రోజులుగా వీధి దీపాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సాయంత్రం 6 నుంచి 7 గంటల సమయంలో బస్టాండ్‌కు చేరుకునే ప్రయాణికులు చీకట్లోనే రాకపోకలు సాగించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బస్టాండ్‌లో సరైన వెలుతురు లేకపోవడంతో దొంగతనాలు జరిగే ప్రమాదం ఉందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ప్రయాణికుల భద్రతకు ఏదైనా ముప్పు వాటిల్లితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే నెల రోజులుగా ఈ సమస్య కొనసాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ (ఆర్‌ఎం), డిపో మేనేజర్ (డీఎం) ఇప్పటికైనా స్పందించి బస్టాండ్‌లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ప్రయాణికుల భద్రతపై అధికారులు నిర్లక్ష్యం వీడాలి.. తక్షణమే వీధి దీపాలు ఏర్పాటు చేసి చీకటి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

























