Homeతెలంగాణభీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు...

భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు…

భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు

జంగం మోహన్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌.. డప్పుల దండోరాతో ప్రజావాణికి చేరుకున్న నాయకులు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం పిప్రి (జె) గ్రామానికి చెందిన జంగం మోహన్‌కు మద్దతుగా దళిత ఐక్య సంఘటన భీమ్‌గల్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గతంలో ప్రజావాణిలో, భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన లేదని ఆరోపిస్తూ, డప్పుల దండోరాతో ప్రజావాణికి చేరుకుని నోడల్ అధికారికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జంగం మోహన్ మాట్లాడుతూ.. 1982లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పిప్రి (జె) గ్రామంలో నిరుపేద ఎస్సీ కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి, ఒక్కో కుటుంబానికి 144 గజాల చొప్పున స్థలం కేటాయించిందని తెలిపారు. తమ ఇంటి పక్కన ఉన్న స్థలాన్ని అరిగెల జనార్దన్ కుటుంబ సభ్యులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూ, తమ ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. ఈ విషయమై 11-06-2018న ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

అప్పట్లో భీమ్‌గల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, గ్రామ పెద్దల సమక్షంలో అరిగెల జనార్దన్ క్షమాపణ చెప్పి, తమ కుటుంబానికి ఆ స్థలంపై ఎలాంటి హక్కు లేదని ఒప్పంద పత్రం రాసిచ్చినట్లు మోహన్ తెలిపారు.

అయితే, ప్రస్తుతం జనార్దన్ సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత అధికార బలం, పార్టీ బలంతో తమ ఇంటి పక్కన ఉన్న స్థలంలో పశువుల పేడ, చెత్త వేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తమ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామపంచాయతీ, మండల కార్యాలయాల్లో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల గురించి అడగగా, తమ వద్ద పట్టాలు లేవని, పోయాయని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు స్పందించి, తమకు న్యాయం చేయాలని కోరారు.

గతంలో 05-10-2026న ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుతో పాటు, 24-09-2026న భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లేందుకు దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో డప్పుల దండోరాతో ప్రజావాణికి వచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దళిత ఐక్య సంఘటన అధ్యక్షుడు కండె కాంతయ్య, పత్రి రాజేందర్, పర్స నవీన్, చితలూరి అవినాష్, తుమ్మ రవీందర్, చెప్పాల పనీంద్రతో పాటు పిప్రి (జె) గ్రామానికి చెందిన జంగం రఘువీర్, జంగం కిరణ్, జంగం బాల పురుషోత్తం, జంగం రత్నారావు, జంగం ప్రమోద్, జంగం నవకాంత్, ఏనుగందుల ప్రణయ్, జంగం జలంధర్, జంగం శేఖర్, పెండా శశికుమార్, జంగం రాకేష్, జంగం సతీష్, జంగం శ్రీనివాస్, గోలి రాహుల్, జంగం ఛత్రపతి, పెండ పెద్ద భాజన్న, జంగం జశ్వంత్, జంగం బాజీరావు, జంగం అప్సర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ…

0
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం: దోమకొండ ఎస్సై ప్రభాకర్, డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న...

పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం…

0
పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం: ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: పౌర్ణమి సందర్భంగా శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్...

ముదిరాజ్‌ కులాన్ని బీసీ-ఏలో చేర్చవద్దు…

0
ముదిరాజ్‌ కులాన్ని బీసీ-ఏలో చేర్చవద్దు బీసీ కమిషన్‌కు గంగపుత్ర సంఘం ప్రతినిధుల వినతిపత్రం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: ముదిరాజ్‌ కులాన్ని బీసీ-డీ నుంచి బీసీ-ఏ వర్గంలోకి మార్చే ప్రతిపాదనపై తమ అభ్యంతరాలను పరిగణనలోకి...

ఆదర్శంగా నిలిచిన చిన్నారి ఐరా పుట్టినరోజు వేడుకలు…

0
ఆదర్శంగా నిలిచిన చిన్నారి ఐరా పుట్టినరోజు వేడుకలు ఎల్‌నినో ప్రభావంతో కష్టాలు ఎదుర్కొంటున్న వేళ.. 12 మంది పేదలకు నిత్యావసర సరుకులు, 100 మందికి అన్నదానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: పుట్టినరోజు వేడుకలను...

నందిపేట్‌లో ఫామ్ పాండ్ నిర్మాణ పనులు ప్రారంభం…

0
నందిపేట్‌లో ఫామ్ పాండ్ నిర్మాణ పనులు ప్రారంభం వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం చర్యలు... నందిపేట్: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో, వర్షపు నీటిని నిల్వ చేసుకోవడంతో...

Translate »
error: Content is protected !!