వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన
వర్షపు నీటిని ఒడిసిపట్టి.. భవిష్యత్తు తరాలకు నీటి భరోసా కల్పించాలి…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి: వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ధర్పల్లిలోని లిటిల్ హార్ట్స్ హైస్కూల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించవచ్చని విద్యార్థులు ప్రజలకు వివరించారు.
ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించడం, వర్షపు నీరు వృథా కాకుండా వినియోగించుకోవడం, చెరువులు, కుంటలను సంరక్షించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. వర్షపు నీటిని సంరక్షించడం ద్వారా భవిష్యత్తు తరాలకు నీటి కొరత లేకుండా చూడవచ్చని సూచించారు.
“వర్షపు నీటిని ఒడిసిపడదాం.. భవిష్యత్తులో నీటి కొరతను నివారిద్దాం” అనే నినాదంతో నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని విద్యార్థులు చాటిచెప్పారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీకాంత్, లాబీ శెట్టి మహేష్‌తో పాటు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

























