ధర్పల్లి: రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి
రైతులకు అధికారుల సూచన…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాదు జిల్లా ధర్పల్లి ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్నినో ప్రభావం ఉన్నందున రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని ధర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రత్యేక అధికారి శ్రీనివాస్ సూచించారు. రాబోయే రోజుల్లో తగినంత వర్షపాతం లేకపోవచ్చని, రైతులు వరి పంటలకు బదులుగా ఆరుతడి పంటలైన రాగులు, నీటి అవసరం తక్కువగా ఉండే పంటలను సాగు చేయాలని సూచించారు. భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు. సమావేశంలో ఎంపీడీవో మారుతి, తహసీల్దార్ శాంతా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

























