సంత్ నిరంకారీ 79 వ వార్షిక ఆధ్యాత్మిక మహాసభల్లో భీంగల్ పట్టణ వాసులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
సంత్ నిరంకారీ 79 వ వార్షిక ఆధ్యాత్మిక మహాసభలు వరంగల్ పట్టణంలో 3 రోజులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇట్టి ఆధ్యాత్మిక మహాసభలకు భీంగల్ పట్టణానికి చెందిన నిరంకారీ భక్తులు ఎన్.జి. సాయన్న, మందం భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక మేల్కొలుపు అనే ముఖ్య ఉద్దేశ్యంతో ఇట్టి మహాసభలను నిర్వహించారు. కేవలం సత్సంగాలకే పరిమితం కాకుండా, ప్రతిక్షణం భగవంతుని స్మరిస్తూ ప్రేమ, కరుణ, వినమ్రతలతో జీవించడమే నిజమైన మేల్కొలుపు అని ప్రబోధించారని సాయన్న భూమేశ్వర్ తెలిపారు. వేలాదిమంది నిరంకారీ సేవకులు క్రమశిక్షణ, సేవా తత్పరతను చాటుతూ నిర్వహించిన భారీ సేవాదళ్ ర్యాలీ ఈ సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశ విదేశాల నుండి లక్షలాదిమంది భక్తులు తరలివచ్చి గురువందన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. నిరంకారీ భక్తులు సాయన్న, భూమేశ్వర్ మాట్లాడుతూ ఇట్టి ఆధ్యాత్మిక మహాసభలలో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాము అని అన్నారు.























