ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో స్ట్రోక్‌పై అవగాహన
స్ట్రోక్ లక్షణాలను ముందుగానే గుర్తించి.. సకాలంలో చికిత్స పొందాలి…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి: ప్రపంచ స్ట్రోక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, ప్రజలకు స్ట్రోక్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూష మాట్లాడుతూ, స్ట్రోక్ లక్షణాలను ముందుగానే గుర్తించి, సకాలంలో వైద్య చికిత్స పొందడం ద్వారా ప్రాణాపాయాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. స్ట్రోక్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హెడ్ నర్స్ జారిన, స్టాఫ్ నర్స్ అరుణ, సూపర్‌వైజర్ భూలక్ష్మి, ఏఎన్‌ఎం మీన, జూనియర్ అసిస్టెంట్ సురేష్, ఆయుష్ ఫార్మసిస్ట్ మురళి, ల్యాబ్ టెక్నీషియన్ మౌనిక, సిబ్బంది పూజ, పద్మ, లత, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

























