పదో తరగతి విద్యార్థులకు జామెట్రీ బాక్సుల పంపిణీ…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలం రామడుగు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఫోర్ట్ సిటీ ఆధ్వర్యంలో జామెట్రీ బాక్సులను పంపిణీ చేశారు.
పాఠశాల ఉపాధ్యాయుడు జలంధర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు డి. రవి, ఉపాధ్యాయులు మధు, నరోత్తం, కరుణ శ్రీ, ప్రశాంత్, శ్యామల, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల చదువుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.

























