హైదరాబాద్ లో ఆవిష్కరించిన అంబం అక్షరాల పుస్తకం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాంగణంలో, శాంతా-వసంత ట్రస్టు సౌజన్యంతో నిర్వహించిన బాలల సాంస్కృతికోత్సవంలో భాగంగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు సృజించిన “అంబం అక్షరాలు” బాలల కథల సంపుటిని మాజీ ఐఏఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారుడు కె.వి. రమణాచారి చేతులమీదుగా ఘనంగా ఆవిష్కరించబడింది. ఇదే వేదికపై కథా రచన విభాగంలో తృతీయ బహుమతి సాధించిన అంబం పాఠశాలకు చెందిన విద్యార్థిని జీడి శరణ్యను నిర్వాహకులు మెమెంటో, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బొడ్డు భరద్వాజ్ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, మాజీ ఉపకులపతి కే.వై. రెడ్డి తదితరులు పాల్గొన్నారు























