కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన మర్యాదపూర్వక భేటీ
తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడ్డం ఇందుప్రియకు ఘన సన్మానం..
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన గడ్డం ఇందుప్రియను కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె నివాసంలో గడ్డం ఇందుప్రియను శాలువాతో ఘనంగా సన్మానించి, నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ.. మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మహిళల హక్కులు, సంక్షేమం, సాధికారత కోసం నాయకులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారంలో అండగా నిలవాలని పేర్కొన్నారు. మహిళా కాంగ్రెస్ను మరింత బలోపేతం చేసేందుకు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.

























