ధర్పల్లిలో దీక్షా దివాస్ స్ఫూర్తి సభ, మెగా ఉచిత వైద్య శిబిరం పోస్టర్ల ఆవిష్కరణ
బీఆర్ఎస్ రూరల్ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్ చేతుల మీదుగా పోస్టర్ల విడుదల…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండల కేంద్రంలో ఈ నెల 29న పద్మశాలి సంఘం భవనంలో నిర్వహించనున్న దీక్షా దివాస్ స్ఫూర్తి సభ, మెగా ఉచిత వైద్య శిబిరానికి సంబంధించిన పోస్టర్లను బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ.. దీక్షా దివాస్ స్ఫూర్తి సభతో పాటు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మెగా ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పీస్ రాజ్ పాల్ రెడ్డి, ఇంద్రనగర్ తండా సర్పంచ్ బాలు నాయక్, మాజీ మండల అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, మహమ్మద్ నజీర్, మంచికంటి నరేందర్, గుగులోత్ రవి తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

























