నల్లవెల్లిలో ఘనంగా భోగ్ భండార్ కార్యక్రమం
41 రోజుల మౌన దీక్ష ముగింపు సందర్భంగా శివగంగ కేదార్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు…
త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం
నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి మండలం నల్లవెల్లిలోని శివగంగ కేదార్నాథ్ ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నిర్వహించిన 41 రోజుల మౌన దీక్ష ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. సంతోష్ మహారాజ్ ఆధ్వర్యంలో భోగ్ భండార్ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సుమారు వెయ్యి మంది భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఆనందంగా గడిపారు.

























