80 మీటర్ల పరుగుపందెంలో ప్రతిభ కనబరిచి మెరిట్ సర్టిఫికెట్ అందుకున్న జి. మిథున్ గౌడ్…
త్రిశూల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి గడిల లింగం
కామారెడ్డి జిల్లా : అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన 12వ జిల్లా స్థాయి సబ్-జూనియర్ మరియు జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో జి. నర్సా గౌడ్ ప్రత్యూష,కుమారుడు జి. మిథున్ గౌడ్ 80 మీటర్ల పరుగుపందెం విభాగంలో పాల్గొని ప్రతిభ కనబరిచి మెరిట్ సర్టిఫికెట్ అందుకున్నాడు.
చిన్న వయసులోనే క్రీడలపై ఆసక్తి చూపిస్తూ అథ్లెటిక్స్‌లో తన ప్రతిభను చాటుకోవడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు.
భవిష్యత్తులో మరిన్ని క్రీడా పోటీల్లో పాల్గొని ఉన్నత విజయాలు సాధించి తల్లిదండ్రులకు, కామారెడ్డి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
మిథున్ గౌడ్‌కు హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు.

























