నిజామాబాదు పోలీస్ కమిషనరేట్లో మౌఖిక విచారణలు ( OE ) కేసులు పెండింగ్ లో వున్నవి తొందరగా పూర్తి చేసి రిపోర్టు అందజేయవలసిందిగా నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ. పి. ఎస్., ఎంక్వైరీ / విచారణ అధికారులకు తగు సూచనలు చేయనైనది. పెండింగ్లో ఉన్న 17 మౌఖిక విచారణ దర్యాప్తును ముమ్మరం చేయాలని పకడ్బందీగా విచారించి రిపోర్టు ఇవ్వవలసిందిగా ఆదేశించినారు. ఇట్టి మేళా యందు మూడు మౌఖిక దర్యాప్తులు ముగిసినందున వెంటనే దర్యాప్తు సారాంశాన్ని పంపించవలసిందిగా ఆదేశించినారు. అదేవిధంగా మిగతా వాటిని కూడా తొందరగా విచారించి వాటి యొక్క సారాంశాన్ని పంపాల్సిందిగా అధికారులను ఆదేశించినారు.
ఇట్టి మౌఖిక దర్యాప్తు మేళాలో అడిషనల్ డీసీపీ ( అడ్మిన్ ) బస్వా రెడ్డి, ఆర్మూర్ , బోధన్ , ట్రాఫిక్ , సి.టి. సి ఎ.సి.పి లు వెంకటేశ్వర్ రెడ్డి , శ్రీనివాస్ , మస్తాన్ అలీ , రాజశేఖర్ , సూపరింటెండెంట్ శ్రీనివాస్ , దర్యాప్తు అధికారులు అదేవిధంగా కక్షిదారులు హాజరైనారు.























