హోన్నాజీపేట్ గ్రామం లో వరి కొనుగోలు కేంద్రం(pacs) ఆధ్వర్యంలో ప్రారంభం
సోమవారం : 13/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండలం హోన్నాజీపేట్ గ్రామం ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం డిసిసి వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాల్ రాజ్ ప్రారంభించారు. సందర్భంగా చిన్న బాల్ రాజ్ మాట్లాడుతూ వరి ఏ గ్రేడ్ ధాన్యానికి మద్దతు ధర 2389,బి గ్రేడ్ ధాన్యానికి మద్దతు ధర2369 ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఈవో గంగా నర్సయ్య, మాజీ ఏఎంసీ డైరెక్టర్ మంగ్యనాయక్,మాజీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి,చెలిమెల మల్లికార్జున్, ఉన్నారు























