ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ డెంగీ నివారణ దినోత్సవం
ధర్పల్లి మండల కేంద్రంలో గల సామాజిక ఆరోగ్య కేంద్రం నందు జాతీయ డెంగీ నివారణ దినోత్సవం పురస్కరించుకొని వైద్య సిబ్బందిచే ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించామని మెడికల్ ఆఫీసర్ తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ…ఎడిస్ దోమ కాటు వల్ల డెంగ్యూ వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉంది. కావున దోమలు ఇండ్లలో మరియు ఇంటి పరిసరాల నీటి నిల్వల యందు ఎక్కువగా పెరుగుతాయి, ఎడిస్ దోమలు పగటిపూట కుడతాయి ఇవి చీకటి మరియు చల్లటి ప్రదేశంలో ఎక్కువగా నిల్వ ఉంటాయి. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది అరుణ లత,పద్మ, మీనా, మురళి వాజీద్ సురేష్, శ్రీనివాస్,పూజ,నవీన్ తదితరులు పాల్గొన్నారు.























