నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్యలకు అరుదైన గౌరవం …
తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనది ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కు చెందిన పలువురికి కీలక పదవులు లభించాయి.
ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షునిగా మోటూరి మురళి గుప్తా . కార్యదర్శి గా పోల సుధాకర్ గుప్తా
కార్యవర్గ సభ్యునిగా కసుబ.సంపత్ గుప్తా నియమితులయ్యారు
ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు మోటూరి మురళి మాట్లాడుతూ తనపై నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడిగా గా నియమించడం చాలా సంతోషంగా ఉందన్నారు తనపై నమ్మకంతో తనకు అరుదైన గౌరవాన్ని అందించిన రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ కి ఎంతో రుణపడి ఉంటానని ఆయన తెలిపారు..
ఇచ్చిన పదవిని న్యాయం చేస్తూ ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తానని ..
30 సంవత్సరాల తర్వాత నిజామాబాద్ జిల్లాకు ఈ అరుదైన గౌరవం లభించిందని ఆయన పేర్కొన్నారు

























