Homeతెలంగాణఆర్టీసీ విలీన ప్రక్రియకు వేగం.. త్వరలో యూనియన్ వెరిఫికేషన్ ఉద్యోగుల అభిప్రాయాలతోనే తుది నిర్ణయం –...

ఆర్టీసీ విలీన ప్రక్రియకు వేగం.. త్వరలో యూనియన్ వెరిఫికేషన్ ఉద్యోగుల అభిప్రాయాలతోనే తుది నిర్ణయం – నిజామాబాద్ రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి.కె. మూర్తి

ఆర్టీసీ విలీన ప్రక్రియకు వేగం.. త్వరలో యూనియన్ వెరిఫికేషన్
ఉద్యోగుల అభిప్రాయాలతోనే తుది నిర్ణయం – నిజామాబాద్ రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి.కె. మూర్తి

నిజామాబాద్, జూన్ 13 (త్రిశూల్ న్యూస్): టీజీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సానుకూలంగా ఉందని నిజామాబాద్ రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి.కె. మూర్తి తెలిపారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన విలీన ప్రక్రియ తాజా పురోగతిపై వివరాలు వెల్లడించారు.

ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల చిరకాల స్వప్నమైన ప్రభుత్వ విలీన అంశాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా పరిగణిస్తోందన్నారు. గత ఏప్రిల్‌లో జరిగిన సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ మూడు కీలక అంశాలను పరిశీలించి సానుకూల నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. అందులో 2021 వేతన సవరణ, కార్మిక సంఘాల పునరుద్ధరణ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశాలు ఉన్నాయని వివరించారు.

విలీన ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ ఇప్పటికే సమావేశమై విలీనానికి సంబంధించిన సాంకేతిక, ఆర్థిక, పరిపాలనాపరమైన అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించిందని తెలిపారు. సమ్మె సమయంలో మిగిలిన డిమాండ్లపై ఆర్టీసీ ఈడీల కమిటీ కార్మిక సంఘాలతో చర్చలు కొనసాగిస్తోందన్నారు.

విలీన ప్రక్రియలో ప్రతి కార్మికుడి స్వరం వినిపించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలలో కార్మిక శాఖ పర్యవేక్షణలో పారదర్శకంగా యూనియన్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన కార్మిక సంఘాల ప్రతినిధులను విలీన ప్రక్రియలో ప్రత్యక్ష భాగస్వాములను చేస్తామని పేర్కొన్నారు.

కార్మిక సంఘాల నుంచి వచ్చే సూచనలు, సలహాలను క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలనకు పంపించి, అందరికీ ఆమోదయోగ్యంగా, నూటికి నూరు శాతం పారదర్శకతతో విలీన తుది ప్రక్రియను పూర్తి చేస్తామని మూర్తి స్పష్టం చేశారు.

ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్తుకు భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆయన, ఎప్పటిలాగే విధులను అంకితభావంతో నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధికి సహకరించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.

– త్రిశూల్ న్యూస్, నిజామాబాద్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాల ముఠా అరెస్ట్…

0
ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాల ముఠా అరెస్ట్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో పలు ట్రాన్స్‌ఫార్మర్ చోరీలకు పాల్పడిన ఆరుగురు నిందితులు అరెస్ట్.. కాపర్ కాయిల్స్, వాహనాలు, చోరీకి ఉపయోగించిన...

భీంగల్ టౌన్ కాంగ్రెస్ కార్యవర్గం ఏర్పాటు…

0
భీంగల్ టౌన్ కాంగ్రెస్ కార్యవర్గం ఏర్పాటు... భీంగల్‌లో కాంగ్రెస్ నూతన కార్యవర్గం నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణ కాంగ్రెస్ కమిటీకి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కాంగ్రెస్...

బడా భీంగల్ గ్రామంలో విజయవంతంగా ఉచిత కంటి వైద్య శిబిరం…

0
బడా భీంగల్ గ్రామంలో విజయవంతంగా ఉచిత కంటి వైద్య శిబిరం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... లయన్స్ క్లబ్ భీంగల్–వేముగల్లు ఆధ్వర్యంలో బడా భీంగల్ గ్రామంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా...

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వాకా మహేష్…

0
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వాకా మహేష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్: కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధిగా యువ కాంగ్రెస్ నాయకుడు వాకా మహేష్ నియమితులయ్యారు. పార్టీ తరఫున ప్రభుత్వ విధానాలను...

భీంగల్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా కాపు కుమ్మరి హరీష్ నియామకం…

0
భీంగల్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా కాపు కుమ్మరి హరీష్ నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ మండలం భీంగల్ పట్టణ కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యదర్శిగా కాపు కుమ్మరి హరీష్ ని నియమించడం...

Translate »
error: Content is protected !!