భీమ్గల్లో ఆదివారం ముడుపు వేసే కార్యక్రమం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీమ్గల్ పట్టణంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న సాంప్రదాయ ఊర పండుగను పురస్కరించుకుని ఆదివారం (జూలై 5) ముడుపు వేసే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పతాని కృష్ణ మరియు కమిటీ సభ్యులు తెలిపారు.
స్థానిక బొదిరే గల్లీలోని శ్రీ మైసమ్మ ఆలయంలో సాయంత్రం 4:00 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని వారు వెల్లడించారు.
ఊర పండుగ ఏర్పాట్లలో భాగంగా నిర్వహించే ఈ ముడుపు కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భీమ్గల్ పట్టణ ప్రజలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
అలాగే, ఈ నెల 12వ తేదీన జరగనున్న ఊర పండుగను సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.

























